Congress Released First List of 55 Candidates | 55 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ తొలి జాబితా విడుదల

0

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులతో కూడిన తొలి జాబితా.. ఎట్టకేలకు విడుదలైంది. మొత్తం 55మంది అభ్యర్థులతో ఈ ఉదయం కాంగ్రెస్ అధిష్టానం…. మొదటి జాబితాను ప్రకటించింది. ఇందులో 12మంది బీసీలు, 12 మంది ఎస్సీలు, ఇద్దరు ఎస్టీలకు అవకాశమిచ్చింది. రెడ్డి సామాజిక వర్గం నుంచి 17మంది…., ఏడుగురు వెలమలు, ఇద్దరు బ్రాహ్మణులు, ముగ్గురు ముస్లిం…

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులతో కూడిన తొలి జాబితా.. ఎట్టకేలకు విడుదలైంది. మొత్తం 55మంది అభ్యర్థులతో ఈ ఉదయం కాంగ్రెస్ అధిష్టానం…. మొదటి జాబితాను ప్రకటించింది. ఇందులో 12మంది బీసీలు, 12 మంది ఎస్సీలు, ఇద్దరు ఎస్టీలకు అవకాశమిచ్చింది. రెడ్డి సామాజిక వర్గం నుంచి 17మంది…., ఏడుగురు వెలమలు, ఇద్దరు బ్రాహ్మణులు, ముగ్గురు ముస్లిం అభ్యర్థులకు చోటు కల్పించింది. మొత్తం…….. ఆరుగురు మహిళలను బరిలోకి దింపింది. వామపక్షాలతో పొత్తులపై చర్చలు కొనసాగుతున్నందున సీపీఐ, సీపీఎంలకు రెండేసి సీట్లు కేటాయించింది. ప్రస్తుతం ప్రకటించిన అభ్యర్థుల్లో TPCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి………….. కొడంగల్ నుంచి బరిలోకి దిగనున్నారు. మధిరలో భట్టి విక్రమార్క, హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి….., ఉత్తమ్ సతీమణి పద్మావతిరెడ్డి కోదాడ నుంచి పోటీ చేయనున్నారు. నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,జగిత్యాలలో జీవన్ రెడ్డి, ములుగు నుంచి సీతక్క బరిలో నిలవనున్నారు. సంగారెడ్డి అభ్యర్థిగా జగ్గారెడ్డి, మంథని దుద్దిళ్ల శ్రీధర్ బాబు, నాగార్జునసాగర్ లో జానారెడ్డి కుమారుడు జైవీర్ రెడ్డి… టికెట్ దక్కించుకున్నారు. మల్కాజిగిరి టికెట్ దక్కించుకున్న మైనంపల్లి హన్మంతరావు మెదక్ టికెట్ ను తన కుమారుడు రోహిత్ రావుకు ఇప్పించుకున్నారు. భారాస నుంచి కాంగ్రెస్ లో చేరిన వేముల వీరేశం…. నకిరేకల్ నుంచి టికెట్ పొందారు
—————————————————————————————————————————-
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
——————————————————————————————————
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
——————————————————————————————————
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News – https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
——————————————————————————————————-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *